ప్రపంచం మన వైపు చూస్తోంది. ఆ దృష్టిలో గర్వం, ఆభినందన, మరియు ఆశ్చర్యం కూడా ఉంది. తెలుగు ప్రజలు ఏ రంగంలో ఉన్నా వారు తెలుగుని ప్రతిబింబింపజేస్తూ, తెలుగు తేజాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఆవిష్కరణలు, రాజకీయాలలో విజయం, కళా రంగాలలో అద్భుత ప్రతిభ – వీటితో ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ప్రతిభావంతులుగా వెలుగుతున్నారు.
ఇటువంటి గొప్ప తరుణంలో మనం మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి మరింత దగ్గరగా తీసుకెళ్లడానికి ఓ వేదికను ఏర్పాటు చేస్తున్నాం. “తెలుగునాట” అనే ఈ వేదిక ద్వారా తెలుగు పండుగలు, సినిమాలు, నృత్యాలు, సంగీతం మరియు కళలను ఆస్ట్రేలియా, అమెరికా, యూరప్ తదితర దేశాలలో నివసించే తెలుగు వారందరికీ అందించడానికి కృషి చేస్తున్నాం.
ప్రతి తెలుగు సంబరానికి పందిరి వేస్తాం, పల్లకి మోస్తాం, ఆ సంబరాలను మరింత గర్వంగా మన తెలుగుతనం తో వెలుగురిస్తున్నాం. ఈ వేదిక ద్వారా మన సంప్రదాయాలను రేపటి తరాలకు అందిస్తూ, మన వారసత్వాన్ని నిలుపుతూ, ప్రతి తెలుగు గుండెలో ఈ స్ఫూర్తిని నింపుతున్నాం.
“తెలుగునాట” – ఇది కేవలం ఒక వేదిక కాదు, ఇది ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజల కోసం ఒక కల, ఒక ఊహ, ఒక జీవితం. మన సంస్కృతిని ఆరాధిస్తూ, మన కళలను ఉరేగిస్తూ, మన విజయాలను సంబరంగా మార్చే ప్రయాణం.
The world is looking at us with admiration, respect, and wonder. Telugu people across the globe are shining as symbols of our heritage, proving their excellence in every field. Be it in science and technology, politics, or the arts, Telugus are making a mark worldwide, carrying the essence of Telugu culture wherever they go.
In this remarkable time, we are creating a platform to bring our culture and traditions closer to the world. Through “Telugunāta,” we aim to connect Telugu people in countries like the USA, Australia, and across Europe with the rich heritage of Telugu festivals, films, dance, music, and art.
At Telugunāta, we celebrate every Telugu festival with grandeur, raise pavilions of joy, and proudly showcase the beauty of our traditions. We cherish our culture and are committed to passing it down to future generations as an undying treasure.
“Telugunāta” is not just a platform; it’s a vision, a dream, and a living tribute to Telugu people worldwide. Together, we share our heritage, celebrate our achievements, and light the way for tomorrow’s Telugu generations, making our identity known across the globe.